సాగర తీరాన పరుగుల సునామీ
దుమ్ము రేపిన కోల్ కతా నైట్ రైడర్స్
విశాఖపట్టణం – విశాఖ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపింది కోల్ కతా నైట్ రైడర్స్. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ పరుగుల వరద పారించింది. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయింది. నువ్వా నేనా అని సాగుతుందని అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా ఒన్ సైడ్ గా మారి పోయింది. పంత్ , స్టబ్స్ కలిసి పోరాటం చేసినా, 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా చివరకు ఓటమి మూటగట్టుకుంది.
ముందుగా మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్ లో రెండో అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి భారీ స్కోర్ చేసింది. ఇక రెండో స్కోర్ ను కేకేఆర్.
విండీస్ స్టార్ క్రికెటర్ సునీల్ సరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఒక రకంగా చుక్కలు చూపించాడు. కేవలం 35 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 85 రన్స్ చేశాడు. ఇషాంత్ శర్మ వేసిన ఒక ఓవర్ లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో వైపు ఆండ్రూ రస్సెల్ దంచి కొట్టాడు. 19 బంతులు మాత్రమే ఎదుర్కొని 41 రన్స్ చేసి స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.