మా నాన్న దమ్మున్నోడు
సంజయ్ సింగ్ కూతురు
న్యూఢిల్లీ – ప్రముఖ నటి, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూతురు ఇషితా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎంపీ బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్బంగా అశేష జనం ఆయనకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా బాలీవుడ్ లో ప్రముఖ నటిగా ఉన్న ఇషితా సింగ్ సీరియస్ కామెంట్స్ చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తందన్నారు. తాము అదే నమ్మకంతో ముందు నుంచి ఉన్నామని, దేవుడు, ప్రజలు తమ వైపు ఉన్నారని తేలి పోయిందన్నారు. ఎంత కాలం తన తండ్రిని జైలులో ఉంచగలరని ప్రశ్నించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోతోందని, రోజు రోజుకు ప్రశ్నించడం కూడా నేరంగా మారిందన్నారు ఇషితా సింగ్. తన తండ్రి సంజయ్ సింగ్ ను అకారణంగా జైలుకు పంపించారని ఆరోపించారు. కానీ తన తండ్రి వెన్ను చూపే రకం కాదన్నారు. ముందుండి పోరాడే మనస్తత్వం కలిగిన అరుదైన ప్రజా నాయకుడు అని ప్రశంసలు కురిపించారు.
తన తండ్రి గురించి తాను గర్వ పడతానని ఎందుకంటే ఆయన జనం లోంచి వచ్చిన లీడర్ అంటూ పేర్కొన్నారు. మోదీ , షా కుట్రలు ఫలించవన్నారు ఇషితా సింగ్.