డిజిటల్ హైజా’కింగ్’ మేకర్ మోదీ
నిప్పులు చెరిగిన సీఎం స్టాలిన్
తమిళనాడు – పార్లమెంట్ ఎన్నికల వేళ డీఎంకే చీఫ్, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలను, ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశంలో డిజిటల్ టెక్నాలజీ పేరుతో జరుగుతున్నది అభివృద్ది కాదని నయా దందా , మోసం , దగా అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలు పోగు చేసుకుని ఆయా ప్రభుత్వ బ్యాంకులలో దాచుకున్న డబ్బులను అప్పనంగా కొట్టేసేందుకు ఈ డిజిటలైజేషన్ పనికి వస్తోందంటూ ధ్వజమెత్తారు. దీనికి అందమైన పేరు పెట్టి బహిరంగాంగా దోచుకునేందుకు మార్గం సుగమం చేసిన ఘనత ఒక్క ప్రధాని మోదీకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరు ఎంకే స్టాలిన్.
ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని నమ్మించి మోసం చేశాడని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , ఆ డబ్బులు ఏమయ్యాయంటూ నిలదీసేందుకు రెడీగా ఉన్నారని జోష్యం చెప్పారు. ఇకనైనా అసలు వాస్తవం తెలుసుకుని విలువైన ఓటు వేయాలని సూచించారు ఎంకే స్టాలిన్.