జగన్ పాలనకు చరమ గీతం పాడండి
పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు
కొవ్వూరు – రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని ఇక ఆయన ఇంటికి వెళ్లడమే మిగిలి ఉందన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు . ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొవ్వూరు, గోపాలుపరం అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా గళం పేరుతో బహిరంగ సభలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమిదే రాబోయే కాలమని , ఇక జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకవు జనం సిద్దమై ఉన్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
తాను మాట ఇవ్వనని ఇస్తే తప్పనని ప్రకటించారు. నిరుద్యోగుల ఆశలు తీరుస్తామని, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తామని తెలిపారు. అంతే కాకుండా సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలను మహరాణులు చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. ప్రగతి పూర్వకమైన ప్రజా పాలన రాబోతోందని చెప్పారు టీడీపీ చీఫ్.