గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ కు గుడ్ బై
పార్లమెంట్ ఎన్నికల వేళ బిగ్ షాక్
న్యూఢిల్లీ – సుదీర్ఘ రాజకీయ చరిత్ర , నేపథ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల వేళ కోలుకోలేని షాక్ తగులుతోంది. పలువురు కీలకమైన నాయకులు ఒక్కరొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్తలు నవీన్ జిందాల్ , తల్లి సునీతా జిందాల్ సైతం గుడ్ బై చెప్పారు.
తాజాగా మరో బిగ్ షాక్ ఇచ్చారు కీలక నాయకుడు గౌరవ్ వల్లభ్. తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు సుదీర్గ లేఖ రాశారు. అనివార్య కారణాల వల్లనే తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
నాలో ఉన్న ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తం చేశానని స్పష్టం చేశారు. కూటమిలోని కొంత మంది పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుపై తాను మనస్తాపం చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేకించినా ఎందుకు మౌనంగా ఉందో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్టీ వేదికపై తాను చేస్తున్న తప్పుల గురించి, తీసుకుంటున్న నిర్ణయాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చానని, కానీ ఇప్పటి వరకు పట్టించు కోలేదని ఆరోపించారు గౌరవ్ వల్లభ్.