ఎంపీగా సోనియా ప్రమాణ స్వీకారం
రాజ్యసభలో గాంధీకి కంగ్రాట్స్
న్యూఢిల్లీ – రాజ్యసభ సభ్యురాలిగా సీపీపీ చైర్ పర్సన్ సొనియా గాంధీ గురువారం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత కొంత కాలం నుంచీ ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో పాలు పంచుకుంటూ వచ్చారు. కానీ తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఈసారి తాను రాయ్ బరేలీ నుంచి బరిలో ఉండడం లేదంటూ ప్రకటించారు సోనియా గాంధీ.
ఈ సందర్బంగా రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సుదీర్ఘ లేఖ రాశారు సీపీపీ చైర్ పర్సన్. తనను మన్నించమంటూ కోరారు. కొన్ని సంవత్సరాల పాటు తనను ఎంపీగా గెలిపించారని, తనను ఆదరించినందుకు గాను ధన్యవాదాలు తెలియ చేశారు సోనియా గాంధీ.
ఇటలీకి చెందిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకరు ప్రియాంక గాంధీ కాగా మరొకరు రాహుల్ గాంధీ. ఇద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో పాపులర్ అయ్యారు.
తాజాగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు ఇతర సీనియర్ నాయకులు కంగ్రాట్స్ తెలిపారు.