NEWSNATIONAL

ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లండి

Share it with your family & friends

సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్

న్యూఢిల్లీ – ఆప్ బాస్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌ర‌పున ఆయ‌న స‌తీమ‌ణి సునీతా కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ ఎమ్మెల్యేల‌కు వీడియో సందేశం ద్వారా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సీఎం ప‌లు సూచ‌న‌లు చేశార‌ని తెలిపారు. అర‌వింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నా ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తున్నార‌ని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు సునీతా కేజ్రీవాల్.

తాను జైలులో ఉన్న‌ప్ప‌టికీ నిరంత‌రం ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించార‌ని తెలిపారు. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాన‌ని మాటిచ్చార‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఎమ్మెల్యే ప్ర‌తి రోజూ త‌మ ప్రాంతంలో ప‌ర్య‌టించాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇందుకు సిద్దంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఏ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని సూచించారు సునీతా కేజ్రీవాల్.
.