కులాన్ని ప్రశ్నించినోళ్లకు చెంపపెట్టు
బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ కామెంట్
ముంబై – ప్రముఖ నటి, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అమరావతి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేశానని, గెలుపొందానంటూ కోర్టులో కేసు వేసిన వాళ్లకు చెంప పెట్టు లాంటి తీర్పు వెలువడిందని అన్నారు.
ఆమె కులానికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఈ మేరకు నవనీత్ కౌర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం సరైనదని భావిస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది.
దీనిపై తీవ్రంగా స్పందించారు ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్. నా పుట్టుకపై, కులంపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన వాళ్లకు ఇదే అసలైన సమాధానమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా నేను సుప్రీంకోర్టుకు రుణపడి ఉన్నానని తెలిపారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని, ధర్మం నిలుస్తుందని ఈ తీర్పుతో రుజువైందని స్పష్టం చేశారు నటి నవనీత్ కౌర్.