బీజేపీ పాలన అభివృద్దికి నమూనా
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
బీహార్ – దేశం అభివృద్ది చెందాలంటే మరోసారి దేశంలో బీజేపీ సంకీర్ణ సర్కార్ రావాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రతిపక్షాలు చెప్పిన కల్లబొల్లి కబుర్లను నమ్మవద్దని మోదీ కోరారు. ఇవాళ ప్రపచంలోనే అత్యున్నతమైన పాలన అందిస్తున్నది తామేనని స్పష్టం చేశారు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సమర్థవంతమైన పాలనను కోరుకుంటారని అది తమ వల్లనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
టెక్నాలజీ పరంగా దేశం ముందంజలో కొనసాగుతోందని , యావత్ భారతం ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుందని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు ప్రధానమంత్రి.
ఒకప్పుడు అన్ని ఉగ్రవాదాలకు దేశం అడ్డాగా ఉండేదని కానీ ఇప్పుడు మనతో పెట్టుకోవాలంటే జంకే స్థితికి తీసుకు వచ్చానని అన్నారు మోదీ.