NEWSANDHRA PRADESH

కేంద్రంపై ఏపీ హైకోర్టు సీరియ‌స్

Share it with your family & friends

విశాఖ స్టీల్ ప్లాంటుపై విచార‌ణ

అమ‌రావ‌తి – విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీక‌ర‌ణకు బ‌దులుగా ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టారనే దానిపై ఎందుకు స‌మాధానం ఇవ్వ‌లేక పోయారంటూ కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేసింది ఏపీ హైకోర్టు. గురువారం ఇదే అంశానికి సంబంధించి విచార‌ణ కొన‌సాగింది.

లేఖ రాస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు తాత్సారం చేశారంటూ నిల‌దీసింది. ఒక బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వం వేల కోట్ల ఆస్తుల‌ను , వేలాది మంది ఉద్యోగుల‌ను క‌లిగిన సంస్థ ప‌ట్ల ఇంత‌టి ఉదాసీన‌త క‌లిగి ఉండ‌డం భావ్యం కాద‌ని పేర్కొంది. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని మండిప‌డింది. లేఖ‌పై క‌చ్చితంగా స్పందించాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.

విచిత్రం ఏమిటంటే కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో ఎక్క‌డా సీఎం రాసిన లేఖ గురించి ఎందుకు ప్ర‌స్తావించ లేద‌ని నిల‌దీసింది. పూర్తి వివ‌రాలు త‌మ‌కు అంద‌జేయాల‌ని ఆదేశించి ఏపీ హైకోర్టు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని సున్నితంగా హెచ్చ‌రించింది.