చిరాగ్ పాశ్వాన్ కు మోదీ కితాబు
మోదీ ప్రధాని కావాలన్న పాశ్వాన్
బీహార్ – రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ ఉండరనేది ప్రతి సారి కనిపిస్తూనే ఉంది. గతంలో బీజేపీ ఎన్డీయే సర్కార్ మంత్రివర్గంలో ఉన్నారు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్. ఆయనను నిర్దాక్షిణ్యంగా బీజేపీ వెళ్లగొట్టింది. ఈ సందర్భంగా తన చిన్నాన్నకు అందలం ఎక్కించింది.
తీరా సీన్ మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ ఎలాగైనా సరే 400 సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు వ్యూహాలు పన్నుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇదే సమయంలో భావ సారూప్యత కలిగిన వారిని ఆహ్వానిస్తోంది.
ఇదే సమయంలో వీడి పోయిన నితీశ్ కుమార్ తో తిరిగి స్నేహం చేసింది. ఆయనే మరోసారి సీఎం గా ఉండేందుకు అంగీకరించింది. ఇక ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి భారీ షాక్ ఇచ్చేలా చేస్తున్నారు మోదీ. తాజాగా చిరాగ్ పాశ్వాన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తన చిన్న సోదరుడు తిరిగి తన గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు.
ఇదే సమయంలో పాశ్వాన్ సైతం ప్రధానిగా మోదీ తిరిగి ఎన్నిక కావడం దేశానికి అవసరమని పేర్కొన్నారు.