NEWSNATIONAL

ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్

Share it with your family & friends

ఇండియా కూట‌మికి భారీ షాక్

న్యూఢిల్లీ – దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. అయితే మోదీ మాత్రం పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. తానే మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి అవుతాన‌ని. ఆయ‌న ఏకంగా ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీ కూట‌మికి క‌నీసం 400 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో పీఎం చెప్పిన విధంగానే ఫ‌లితాలు రానున్నాయ‌ని తేల్చింది.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఏయే పార్టీకి ఎన్నెన్ని సీట్లు రాబోతున్నాయో కూడా ప్ర‌క‌టించేసింది. మొత్తంగా బీజేపీ హ‌వా కొన‌సాగ‌బోతోంద‌ని పేర్కొంది. ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీకి 22 సీట్లు రానున్నాయ‌ని, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క సీటు ద‌క్క బోతోంద‌ని, అధికారంలో టీఎంసీకి 19 సీట్ల‌కే ప‌రిమితం కాబోతోంద‌ని షాక్ ఇచ్చింది.

మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి 37 , మ‌హా వికాస్ అఘాడీకి 11 సీట్లు , కాంగ్రెస్ కు ఒక సీటు ద‌క్క‌నుంద‌ని జోష్యం చెప్పింది. బీహార్ లో బీజేపీకి 18 , ఆర్జేడీకి ఓక‌టి, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రానుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బీజేపీ భారీ సీట్ల‌ను కైవ‌సం చేసుకోనుంది. ఏకంగా ఆ పార్టీకి 77 సీట్లు రానున్నాయ‌ని తెలిపింది. స‌మాజ్ వాది పార్టీకి 3 సీట్లు , కాంగ్రెస్ కు ఒక సీటు రానుంది.

క‌ర్ణాట‌క‌లో బీజేపీకి 24 సీట్లు , కాంగ్రెస్ కు కేవ‌లం 4 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీజేపీకి 3 సీట్లు రాగా , టీడీపీకి 12 సీట్లు, వైసీపీకి 10 సీట్లు , కేర‌ళ‌లో బీజేపీకి 3 సీట్లు, కాంగ్రెస్ కు 10 సీట్లు, సీపీఎంకు 7 సీట్లు రానున్నాయి.

తెలంగాణలో బీజేపీకి 5 సీట్లు, కాంగ్రెస్ కు 9 సీట్లు, బీఆర్ఎస్ కు 2 సీట్లు , ఎంఐఎంకు ఒక సీటు రానుంది. తమిళ‌నాడులో బీజేపీకి 3 సీట్లు, డీఎంకేకు 18 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు, ఏఐడీఎంకేకు 4 సీట్లు , పుదుచ్చేరిలో బీజేపీకి ఒక సీటు, అండ‌మాన్ లో బీజేపీకి ఒక సీటు, ల‌క్ష్మ‌ద్వీప్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రానుంద‌ని పేర్కొంది.

హ‌ర్యానాలో బీజేపీకి 10 సీట్లు , ఢిల్లీలో బీజేపీకి 7 సీట్లు, ఉత్త‌రాఖాండ్ లో బీజేపీకి 5 సీట్లు, పంజాబ్ లో బీజేపీకి 3 సీట్లు, కాంగ్రెస్ కు 3 సీట్లు, ఆప్ కు 6 సీట్లు , ఎస్ఏడీ పార్టీకి ఒక సీటు ద‌క్క‌నుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీకి 4 సీట్లు , జ‌మ్మూ కాశ్మీర్ , ల‌ఢ‌క్ లో బీజేపీకి 3 సీట్లు , నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు రానున్నాయి. ల‌ఢ‌క్ లో బీజేపీకి ఒక సీటు , చండీగ‌డ్ లో బీజేపీకి ఒక సీటు రానుంది.

ఇక మ‌హారాష్ట్రంలో బీజేపీకి 37 సీట్లు , రాజ‌స్థాన్ లో బీజేపీకి 25 సీట్లు, గుజ‌రాత్ లో బీజేపీకి 26 సీట్లు , మ‌ధ్య ప్ర‌దేశ్ లో బీజేపీకి 29 సీట్లు, గోవాలో బీజేపీకి 2 సీట్లు , దాద్రా, హ‌వేలీ, డామ‌న్ , డ‌య్యూ లో బీజేపీకి 2 సీట్లు , ఒడిశాలో బీజేపీకి 10 సీట్లు, బిజూ జ‌న‌తా ద‌ళ్ కు 11 సీట్లు, అస్సాంలో బీజేపీకి 12 సీట్లు, ఏఐయూడీఎఫ్ కు 2 సీట్లు రానున్నాయ‌ని పేర్కొంది.

ఈశాన్య రాష్ట్రాల‌లో బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ కు 2 సీట్లు , ఓటీహెచ్ కు ఒక‌టి, ఛ‌త్తీస్ గఢ్ లో బీజేపీకి 10 సీట్లు , కాంగ్రెస్ కు ఒక సీటు, జార్ఖండ్ లో బీజేపీకి 13 సీట్లు, జేఎంఎంకు ఒక సీటు రానుంద‌ని జోష్యం చెప్పింది.