చంద్రబాబు మనిషి కాదు శాడిస్ట్
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య ఆగ్రహావేశాలతో కూడిన కామెంట్స్ కొనసాగుతుండడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది.
తాజాగా ఎన్నికల సంగ్రామానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు.
ఎన్నికల వేళ కావాలని బాబు అండ్ కంపెనీ పెన్షన్లు ఇవ్వ కూడదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, దీంతో పెన్షన్లు అందక లబ్దిదారులు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని అభ్యంతరం చెబుతూనే మరో వైపు అదేమీ తెలియనట్టు నటిస్తుండడం దారుణమన్నారు జగన్ రెడ్డి.
నవ రత్నాలు పేదలకు ఆసరాగా నిలిచాయని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తమదేనని, అవే తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. బాబు మనిషి కాదని ఓ శాడిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం.