ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది

స్ప‌ష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే

ముంబై : నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు సుప్రియా సూలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీలో క‌లుపుతార‌ని. దీనిపై మంగ‌ళ‌వారం సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. ఇది త‌న వ‌ర‌కు కూడా వ‌చ్చింద‌న్నారు. అయితే ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌న్నారు. కేంద్రంలో UPA ప్రభుత్వంలో 10 ఏళ్లు, అలాగే మహారాష్ట్రలో 18 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాం అని చెప్పారు సుప్రియా సూలే.

2004లో సోనియా గాంధీ గొప్ప ఉదారతను ప్రదర్శించారని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినప్పటికీ, ప్రణబ్ ముఖర్జీ స్వయంగా మా ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ సాహెబ్‌కు తగిన గౌరవం ఇచ్చిందని ప్ర‌శంసించారు. 2004 తర్వాత 10 ఏళ్లపాటు శరద్ పవార్ మన్మోహన్ సింగ్‌తో కలిసి పని చేశార‌ని అన్నారు. కాంగ్రెస్ , NCP పార్టీలలో చాలా మంచి నాయకులు ఉన్నారు, అలాగే ఈ రెండు పార్టీల సిద్ధాంతం కూడా ఒక్కటేన‌ని అన్నారు.

ప్రస్తుతానికి విలీనం గురించి ఎలాంటి చర్చా జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు సూలే. NCP ఆవిర్భావం నుంచీ కాంగ్రెస్‌తోనే ఉంది, ఇక ముందూ కాంగ్రెస్‌తో కలిసే ఉంటుంద‌ని నొక్కి చెప్పారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *