తెలంగాణ వివాదం జ‌న‌సేన ఢిల్లీ స‌మావేశం

తెలంగాణ‌వాదులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఫైర్

న్యూఢిల్లీ : ఇప్పుడు అంద‌రి క‌ళ్లు తెలంగాణ‌పై ప‌డ్డాయి. జ‌న‌సేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణ‌వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకోసారి నోరు జారితే బ‌డిత పూజ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రో వైపు బీజేపీ క‌న్ను తెలంగాణ‌పై ముఖ్యంగా హైద‌రాబాద్ పై ప‌డింది. దాంతో పాటు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆంధ్ర వ్యాపార‌వేత్త‌ల దృష్టి కూడా దీనిపై ఉంది. ఎలాగైనా దీనిపై పెత్త‌నం సాగించేందుకు కుట్ర‌ల‌కు తెర లేపారు. దీనికి వంత పాడుతున్నాడ‌ని తెలంగాణ వాదులు సీఎం రేవంత్ రెడ్డి పై మండిప‌డుతున్నారు.

ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు జార‌డం, ఆపై ఉన్న‌ట్టుండి జ‌న‌సేన పార్టీ ముఖ్య స‌మావేశం ఇవాళ న్యూఢిల్లీలోని అశోక హోట‌ల్ లో నిర్వ‌హించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మీటింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. సేన ప్రస్థానం… జాతీయ సమగ్రత కోసం అనే విధానంపై నాయకులకు పార్టీ బాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజ‌ర‌య్యారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటు కావ‌డం ప‌ట్ల ఆస‌క్తి రేపుతోంది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *