మీనాక్షి విష‌యంలో హైక‌మాండ్ సీరియ‌స్

ఎవ‌రు లీకు చేశార‌నే దానిపై విచార‌ణ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డి నుంచి ఆమెకు సంబంధించిన కేసు ఫైల్ ఎలా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎలా చేరింద‌ని, ఎవ‌రు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందేలా చేశారో తేలాల్సి ఉంద‌ని సీరియ‌స్ గా ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. ఓ టీవీ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీకి సమాచారం లీక్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. తనను కూడా ఇదే విష‌యం గురించి అధిష్టానం పెద్దలు కూడా విచారించారని తెలిపారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వం మీ చేతుల్లోనే ఉంద‌ని, దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు. సీఎం ఆధ్వ‌ర్యంలోనే హోం శాఖ ఉండ‌డం గ‌మనార్హం.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *