శశాంక్ సింగ్ కింగ్
గుజరాత్ కు బిగ్ షాక్
అహ్మదాబాద్ – శుభ్ మన్ గిల్ రాణించినా ఫలితం లేక పోయింది. అహ్మదాబాద్ స్వంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు ఉన్నప్పటికీ గెలుపు అందుకోలేక పోయింది. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ టైటాన్స్ .
నిర్ణీత 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ టీం ఆదిలోనే వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చాడు శశాంక్ సింగ్.
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి తోడు గా అశుతోష్ శర్మ తోడ్పాటు అందించాడు. శశాంక్ 61 రన్స్ చేస్తే శర్మ 31 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి ఓవర్ లో 7 పరుగులు కావాల్సి ఉండగా శశాంక్ పని పూర్తి కానిచ్చేశాడు.
ఇదిలా ఉండగా 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ కు ప్రాణం పోశాడు శశాంక్ సింగ్. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తానేమీ తక్కువ కాదంటూ అశుతోష్ శర్మ కూడా దంచి కొట్టాడు.