లిక్కర్ స్కామ్ లో కవిత క్వీన్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపణ
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారాయని, ఈ మొత్తం వ్యవహారం అంతా కల్వకుంట్ల కవిత కనుసన్నలలోనే నడిచిందని పేర్కొంది. ఆమెకు గనుక ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే ఆధారాలను తారుమారు చేస్తుందని ఆరోపించింది. ఇప్పటి వరకు కవితకు చెందిన 10 ఫోన్లను రీ ఫార్మాట్ చేయడం జరిగిందని తెలిపింది ఈడీ.
ఆమె అనుకున్నంత అమాయకురాలు కాదని, అప్రూవర్ గా మారిన వారిని తన గురించి సమాచారం చెప్పవద్దంటూ వారిని బెదిరింపులకు గురి చేసిందని, ఒక రకంగా లిక్కర్ లో మాఫియా డాన్ గా వ్యవహరించిందని, తన కొడుక్కి పరీక్షలు ఉన్నాయని, అందుకే తాను ఉండాలని పేర్కొనడం అబద్దమని పేర్కొంది. పిల్లాడిని చూసుకునేందుకు కుటుంబీకులు ఉన్నారని, తను తప్పించుకునేందుకు గాను ఈ ప్లాన్ చేసిందని ఆరోపించింది.
దీంతో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. ఇక కవితకు తీహార్ జైలే గతి పట్టనుంది.