NEWSNATIONAL

భ‌యం అన్న‌ది నా బ్ల‌డ్ లో లేదు

Share it with your family & friends

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ కామెంట్

ఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆరు నెల‌ల పాటు తీహార్ జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భ‌యం అన్న‌ది త‌న బాడీలో లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాను కింది స్థాయి నుంచి వ‌చ్చిన వాడిన‌ని , ఎలా పోరాడాలో, ఎలా ఉద్య‌మించాలో త‌న‌కు బాగా తెలుస‌ని చెప్పారు.

ఈ ఆరు నెల‌ల కాలంలో తాను చాలా కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి దూరంగా ఉండ‌డం ఒకింత ఇబ్బంది క‌లిగించింద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో జైలు జీవితం త‌న‌కు మ‌రింత ఉత్సాహాన్ని, ఊపును ఇచ్చింద‌ని అన్నారు సంజ‌య్ సింగ్.

అయితే తాను ఎక్క‌డా నిర్ల‌క్ష్యం వ‌హించ లేద‌ని పేర్కొన్నారు. తాను ఎక్కువ‌గా పుస్త‌కాల‌ను చ‌దివేందుకు స‌మ‌యం కేటాయించాన‌ని తెలిపారు. దీని వ‌ల్ల మ‌రింత ప్ర‌పంచాన్ని అర్థం చేసుకునేందుకు వీలు క‌లిగింద‌న్నారు. మోదీని, బీజేపీని ఎలా ఢీకొనాలో త‌న‌కు బాగా తెలుస‌న్నారు సంజ‌య్ సింగ్. త‌మ పార్టీకి చెందిన కేజ్రీవాల్ , స‌త్యేంద్ర జైన్ , సిసోడియాల‌ను జైలులో పెట్టార‌ని వాళ్లు లేక పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.