తమిళనాట డీఎంకే హవా
39 సీట్లలో 22 సీట్లు వచ్చే ఛాన్స్
న్యూఢిల్లీ – దేశంలో ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ తాజాగా తన సర్వే ఫలితాలను ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే మరోసారి సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సత్తా చాటనుందని పేర్కొంది.
ప్రస్తుతం డీఎంకే ఇండియా కూటమిలో భాగంగా ఉంది. స్టాలిన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ కూడా భారీగా సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ పదే పదే చెబుతూ వస్తోంది.
ఈ తరుణంలో రాష్ట్రంలో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో అధికార పార్టీ మరోసారి సత్తా చాటనుంది. డీఎంకేకు ఇందులో ఏకంగా 21 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 7 సీట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇక బీజేపీకి 2 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని బాంబు పేల్చింది. ఏఐడీఎంకేకు 1 నుంచి 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 4 నుంచి 5 మంది గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది.