రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఫైర్
వాయనాడ్ – కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిప్పులు చెరిగారు. వాయనాడులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి తరపున ఆమె ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
రాహుల్ నామినేషన్ సందర్బంగా జరిగిన ర్యాలీలో ముస్లిం లీగ్ జెండాలు కనిపించాయని, బీజేపీ తో పాటు మీడియా ఫోకస్ చేయడంతో ఉన్నట్టుండి అవి మాయమయ్యాయని ఆరోపించారు స్మృతీ ఇరానీ. అసలు తప్పు చేయక పోతే ముస్లిం లీగ్ కు సంబంధించిన పతాకాలు ఎందుకు దాయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సంఘ విద్రోహ శక్తుల మద్దతు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పూర్తిగా హిందూ వ్యతిరేక భావజాలం కలిగి ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్మృతీ ఇరానీ. భారత రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవస్థకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ సెటైర్ వేశారు కేంద్ర మంత్రి.
అనాది నుంచి వస్తున్న సనాతన ధర్మం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో రాహుల్ గాంధీ దేశానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు స్మృతీ ఇరానీ.