NEWSNATIONAL

నా రికార్డును నేనే అధిగ‌మిస్తా

Share it with your family & friends

ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా కామెంట్

ప‌శ్చిమ బెంగాల్ – దేశంలోనే తొలిసారిగా లోక్ స‌భ అభ్య‌ర్థిత్వానికి నా పేరు ప్ర‌క‌టించినందుకు త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ న‌టుడు, టీఎంసీ ఎంపీ అభ్య‌ర్థి శ‌త్రుఘ్న సిన్హా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్నేళ్లుగా నేను అసోన్ సోల్ లోనే ఉన్నాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు.

వారి ఆద‌రాభిమానాలు, పార్టీ ప‌ట్ల నా నిబ‌ద్ద‌త‌, చేస్తున్న కృషి , అంకిత భావం ఇవే త‌న‌ను మ‌రోసారి ఎంపీగా పోటీ చేసేందుకు దోహ‌ద ప‌డ్డాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు న‌టుడు సిన్హా. గ‌తంలో రికార్డు స్థాయిలో నాకు ప్ర‌జ‌లు విజ‌యాన్ని క‌ట్ట బెట్టార‌ని తెలిపారు.

కానీ ఈసారి ఆ రికార్డును తిర‌గ రాయాల‌న్న‌దే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను గెల‌వ‌డంలో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఎందుకంటే ప‌ని చేసే వారిని ప్ర‌జ‌లు అక్కున చేర్చుకుంటార‌ని త‌న విష‌యంలో రూడీ అయ్యింద‌ని అన్నారు శ‌త్రుఘ్న సిన్హా. త‌న‌కు టికెట్ కేటాయించినందుకు సీఎం దీదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.