కొలువు తీరిన సోనియా గాంధీ
అరుదైన సన్నివేశానికి వేదిక
న్యూఢిల్లీ – పార్టీల పరంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ లో వారంతా ఒక్కటేనని మరోసారి నిరూపించారు గాంధీ కుటుంబం. ప్రధానంగా సోనియా గాంధీ మరోసారి రాజ్యసభ సభ్యురాలిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం గ్రూప్ ఫోటో దిగారు.
రాజ్యసభ చైర్ పర్సన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ తో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వదేరా కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనడం లేదని ప్రకటించారు. తనను మన్నించాలని కోరుతూ రాయ్ బరేలి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో సోనియా గాంధీ రాజ్య సభ కు నామినేట్ అయ్యారు. మొత్తంగా గ్రూప్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారడం విశేషం.