ప్రీతి జింతా వైరల్
పంజాబ్ కింగ్స్ విక్టరీ
అహ్మదాబాద్ – ప్రముఖ బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు ఓనర్ అయిన ప్రీతి జింతా తళుక్కున మెరిశారు. ఆమె పట్టరాని సంతోషానికి లోనయ్యారు. ఇందుకు కారణంగా ఊహించని రీతిలో బలమైన గుజరాత్ టైటాన్స్ ను తన స్వంత మైదానంలో ఓడించడం.
ఐపీఎల్ 2024లో భాగంగా మోదీ స్టేడియంలో కీలకమైన లీగ్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థితి. ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ మ్యాచ్ అత్యంత టెన్షన్ కు గురి చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది. పంజాబ్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆది లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది పంజాబ్ . ఈ సమయంలో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ దుమ్ము రేపాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 61 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
అతడికి తోడుగా అశుతోష్ శర్మ నిలిచాడు. తను కూడా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 31 పరుగులు చేసి విజయ తీరాలకు చేర్చాడు. చివరగా విన్నింగ్ షాట్ తో శశాంక్ భళా అనిపించాడు. స్టేడియంలో ఉన్న ప్రీతి జింతా తెగ ముచ్చట పడింది. ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మరాయి.