ఆమె లేకపోతే నేను లేను
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, ఒత్తిళ్లను దూరం చేస్తూ అన్నీ తానై తనను చూసుకుంటోందని ప్రశంసలు కురిపించారు విజయ సాయి రెడ్డి తన భార్య సునందా విజయ సాయి రెడ్డి పై. ఆమె లేక పోతే తాను లేనని కితాబు ఇచ్చారు.
జీవితంలో తాను ఎందరి నుంచో స్పూర్తి పొందుతుంటానని వారిలో తన భార్య కూడా ఒకరు అని పేర్కొన్నారు ఎంపీ వీజయ సాయి రెడ్డి. తాను ఎంపీగా బరిలో ఉండడంతో తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని తెలిపారు. ఈ సమయంలో తన భార్య తన ఇబ్బందిని గమనించింది తాను కూడా ప్రచారంలో పాలు పంచుకుంటోందని స్పష్టం చేశారు.
ఆమె ప్రచారం చేయడం వల్ల తనకు కొంత అండగా ఉందని , ఇది మాటల్లో తాను చెప్పలేనంటూ పేర్కొన్నారు ఎంపీ. నెల్లూరు జిల్లా ప్రజల కోసం ఆమె ప్రచారం చేయడం తనకే కాదు తనను అనుసరిస్తున్న వారికి కూడా సంతోషం కలిగించిందని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి.