వాచ్ మెన్ గా ఉదయనిధి పనికిరాడు
సంచలన కామెంట్స్ చేసిన కె. అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డీఎంకేను, సీఎం ఎంకే స్టాలిన్ ను, ఆయన తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను ఏకి పారేశారు.
తన తాత కరుణానిధి, తండ్రి ఎంకే స్టాలిన్ పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పాలిటిక్స్ లోకి వచ్చి చూడమని సవాల్ విసిరాడు.
అంతే కాదు ఉదయనిధికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. కనీసం ఓ ప్రైవేట్ కంపెనీలో వాచ్ మెన్ కు కావాల్సిన అర్హత కూడా ఉదయనిధి స్టాలిన్ కు లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు కె. అన్నామలై. ఒకవేళ ఉదయనిధికి గనుక ఉద్యోగం వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఉదయనిధి గురించి వ్యక్తిగత విమర్శలకు దిగడంపై డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మండిపడ్డారు కె. అన్నామలైపై. దిగజారుడు రాజకీయాలు, కామెంట్స్ మానుకోవాలని సూచించారు.