జనం లోకి జన సేనాని
7 నుంచి వారాహి ప్రజా యాత్ర
అమరావతి – తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా వేసిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి ప్రజా యాత్ర తిరిగి ఈనెల 7 నుంచి ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపి వేసింది. హుటా హుటిన హైదరాబాద్ వెళ్లి పోయారు. ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా జ్వరానికి లోనయ్యారు.
మెరుగైన చికిత్స అందించడంతో పవన్ కళ్యాణ్ కోలుకున్నారు. దీంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని పార్టీ పేర్కొంది. ఆదివారం నుంచి వారాహి విజయ యాత్రను కొనసాగించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపింది.
ఇదిలా ఉండగా 7న అనకాపల్లిలో, 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారని . 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి