సీఎం విజ‌య్ వ్య‌క్తిత్వం ప్ర‌త్యేకం : స‌మంత‌

మార్పు కోసం ఆయ‌న ప‌డుతున్న శ్ర‌మ గొప్ప‌ది

చెన్నై : త‌మిళ‌నాడులో సీఎంగా కొలువు తీరారు అగ్ర న‌టుడు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. బుధ‌వారం ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎంను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ రోజు నేను చెన్నైలో అడుగు పెట్టినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. విజయ్ కేవలం తెరపై కనిపించే హీరోగా మాత్రమే ఉండిపోయే వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయనలోని ఉత్సాహం, ఆయన వ్యక్తిత్వం, ప్రజలు ఆయనకు చూపే ఆదరణ చూస్తుంటే, ఆయన ఏదో గొప్ప కార్యం కోసం ఉద్దేశించ బడ్డారని అనిపించేది.

పూర్తిగా కొత్త రంగంలోకి అడుగు పెట్టడానికి అవసరమైన ధైర్యం నన్ను ఎంతగానో స్ఫూర్తింప జేస్తుంది. ఇప్పటికే పట్టు సాధించిన రంగాన్ని వదిలిపెట్టి, అత్యంత కీలకమైన సవాలును స్వీకరించడం… ఇది సులభం కాబట్టి కాదు, ఏదైనా మార్పు తీసుకు రాగలననే నమ్మకంతో చేసే పని ఇది. మన జీవితంలో ఏదో ఒక దశలో, మనం మరింత గొప్ప పని చేయాల్సిన పిలుపును అందుకుంటామని నాకనిపిస్తుంది. మన గురించి మాత్రమే కాకుండా, సమాజానికి మనం ఏ విధంగా తోడ్పడగలమో ఆలోచించడం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపున‌కు స్పందిస్తారు.

విజయ్ ని ఇప్పటికే నమ్ముతున్న వారిని కూడా ఆయన ఆశ్చర్య పరుస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన చేపట్టబోయే పదవి వల్ల కాదు, ఆ బాధ్యతను ఆయన స్వీకరించే విధానం, ఆయనలోని సంకల్పం వల్ల అది సాధ్యమవుతుంది. ఆయనకు శక్తి, వివేకం , తన లక్ష్య ప్రయాణంలో దృఢంగా నిలిచే ధైర్యం లభించాలని కోరుకుంటున్నాను. అలాగే, దీన్ని చూస్తున్న యువతకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను . మీరు మొదట కన్న కల కంటే జీవితం ఎంతో గొప్పది. విస్తృతమైనది అని గుర్తుంచుకోండి,

  • Related Posts

    ‘ఆదర్శ కుటుంబం’ నారాయ‌ణ‌మ్మ పాట అదుర్స్

    హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్. ఇక మాట‌ల మాంత్రికుడిగా, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా టాప్ లో కొన‌సాగుతున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ఆద‌ర్శ కుటుంబం –…

    సోష‌ల్ మీడియా వ‌ద్దు ప్రేమ‌ను పంచండి

    చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫ్యాన్స్ కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని, ద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేమ‌ను పంచాల‌ని కోరాడు. ఘర్షణలకు దూరంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *