కావ్య మారన్ కళ కళ
ఉప్పల్ లో ముద్దుగుమ్మ
హైదరాబాద్ – మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్. ఆమె ఎక్కడుంటే అక్కడ వాతావరణం పూర్తిగా మారి పోతుంది. తనకు క్రికెట్ అంటే ఇష్టం. ప్రస్తుతం జట్టును టేకోవర్ చేశాక కొన్ని ఒడిదుడుకులకు లోనైంది. కానీ ఈసారి ఎస్ ఆర్ హెచ్ జట్టు ఊహించని దానికంటే ఎక్కువగా సత్తా చాటుతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు ఉన్నా అందరి దృష్టి కేవలం లవ్లీ బ్యూటీ కావ్య మారన్ పైనే ఉంటోంది.
తాజాగా హైదారాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో కీలకమైన లీగ్ మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ , ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. ముందుగా ఎస్ ఆర్ హెచ్ స్కిప్పర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు హైదరాబాద్ ఆటగాళ్లు. 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఎస్ ఆర్ఎస్ ప్లేయర్లు దుమ్ము రేపారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ గెలుపొందారు. దీంతో తెగ సంతోషానికి లోనైంది..డ్యాన్సులతో హోరెత్తించింది కావ్య మారన్ .