వైసీపీకి షాక్ కృపారాణి జంప్
కాంగ్రెస్ లో భారీగా చేరికలు
అమరావతి – ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. కీలకమైన నాయకులు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఇదే సమయంలో జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. ఆమె కడప నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. బద్వేల్ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి ఆ పార్టికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ బాస్ కు రాజీనామా లేఖ పంపించారు. ఆ వెంటనే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్బంగా ఏపీ పీసీసీ చీఫ్ ప్రసంగించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దివంగత ప్రజా నాయకుడు వైఎస్సార్ పేరు చెప్పుకుని పవర్ లోకి వచ్చిన వారు ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారంటూ ధ్వజమెత్తారు.