SPORTS

అభిషేక్ ఆట అదుర్స్ – సీఎం

Share it with your family & friends

కితాబు ఇచ్చిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – నగ‌రంలోని ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 165 ర‌న్స్ చేసింది. ఈ సంద‌ర్బంగా ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి త‌న స‌తీమ‌ణి గీతా రెడ్డితో క‌లిసింది. తాను క‌నులారా మ్యాచ్ ను చూడటం సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నారు.

శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ఫోటోల‌ను షేర్ చేశారు. అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో దుమ్ము రేపి..స‌త్తా చాటిన అభిషేక్ శ‌ర్మకు కితాబు ఇచ్చారు రేవంత్ రెడ్డి. మ్యాచ్ అనంత‌రం అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్న అత‌డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్ర‌దానం చేశారు.