మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఊరటనివ్వని కోర్టు తీర్పుతో షాక్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నిరాశే మిగిలింది. ఇవాళ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంపై విచారణ జరిగింది కోర్టులో.
ఇప్పటికే ఆప్ కు చెందిన సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎంపీ సంజయ్ సింగ్ కూడా తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే సంజయ్ సింగ్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్ షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా మనీష్ సిసోడియా ఇప్పటి వరకు జైలులో 13 నెలలుగా ఉంటున్నారు. ఆయన జైలు నుంచే లేఖ విడుదల చేశారు. గతంలో దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు సైతం ఇదే ధోరణితో ఉన్నారని, కానీ చివరకు దేశాన్ని విడిచి పెట్టి పోవల్సి వచ్చిందని గుర్తు చేశారు.
అధికారం ఉందనే అహంకారంతో ఆనాటి బ్రిటిషర్ల పాలనను ప్రధాన మంత్రి మోదీ, ఆయన పరివారం ప్రవర్తిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చరిత్ర ఎవరినీ ఊరికే విడిచి పెట్టదని హెచ్చరించారు సిసోడియా.