విశాఖ ఏపీకి భవిష్యత్ రాజధాని
ప్రకటించిన ప్రజాశాంతి పార్టీ చీఫ్
విశాఖపట్టణం – ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పట్టణమే ఏపీకి కాబోయే రాజధాని అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఎందుకు రాజధాని కావాలని అనుకుంటున్నారనే దానికి సంబంధించి ఏడు కారణాలు వివరించారు.
తాను వైజాగ్ లో పుట్టి పెరిగానని, లక్షలాది మంది పేదలకు దాన ధర్మాలు చేశానని తెలిపారు. చంద్రబాబు నాయుడు, దివంగత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి పూర్తిగా ఏపీని విస్మరించారని, అప్పులపాలు చేశారంటూ ఆరోపించారు.
హైదరాబాద్ , బెంగళూరు నగరాలకు 100 కంపెనీలను తీసుకు వస్తానని, 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కు చెందిన 15000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని వాటిని ఆయా కంపెనీలకు ఇస్తే మరింత ఉపాధికి ఊతం ఏర్పడేలా జరుగుతుందన్నారు డాక్టర్ కేఏ పాల్.
స్టీల్ ప్లాంటు భూములను విక్రయించేందుక ప్లాన్ జరుగుతోందని ఇందు కోసం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు సహకరిస్తున్నాయని ఆరోపించారు . తనను గనుక ఎంపీగా ఎన్నుకుంటే ఎవరూ ఊహించని రీతిలో విశాఖ నగరాన్ని దేశానికే తల మానికంగా చేస్తానని ప్రకటించారు . వైజాగ్ సెంటర్ ను టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్ గా మారుస్తానని తెలిపారు.