పార్టీ కంటే ప్రజలే బరిలో ఉన్నారు
ప్రధానమంత్రి మోదీ కామెంట్స్
ఉత్తర ప్రదేశ్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా శనివారం యూపీ లోని సహరాన్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో పీఎం ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రజల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రస్తుత ఎన్నికల్లో తాము బరిలో ఉండడం లేదన్నారు. కానీ ప్రజలే తమ తరపున పోటీలో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. పెద్ద సంఖ్యలో ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
ఈసారి కూడా తమను ఆశీర్వదించాలని కోరారు మోదీ. తమకు ఈసారి ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. ప్రతిపక్షాలకు అంత సీన్ లేదన్నారు. తాము గెలవ బోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిని ప్రజలు ఛీత్కరించడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశం అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.