వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో జంప్
బాబుకు కండువా కప్పిన షర్మిల
అమరావతి – ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు ఉన్నట్టుండి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం బస్సు యాత్ర చేపట్టిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో చేరారు.
పేదోడి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఇవాళ ఏపీలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . వైసీపీ ఎమ్మెల్యే పార్టీలోకి రావడంతో మరింత బలం చేకూరిందన్నారు.
ఏపీని సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుతో పాటు జగన్ మోహన్ రెడ్డికి భాగం ఉందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ . రాబోయే రోజుల్లో మరికొందరు కీలకమైన నేతలు తమ పార్టీలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే హస్తానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , టీడీపీ కూటమిని, వైసీపీని నమ్మే స్థితిలో లేరన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.