గద్దరన్న కూతురును విస్మరిస్తే ఎలా
నిప్పులు చెరిగిన దాసోజు శ్రవణ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మరోసారి దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఆయన పేరు చెప్పుకుని పార్టీ వాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరుతో అవార్డులు ఇస్తామంటూ ప్రకటించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
ఎందుకని గద్దరన్న కూతురు వెన్నెలకు ఈసారి టికెట్ ఇవ్వలేదో చెప్పాలని దాసోజు శ్రవణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని, ఏఐసీసీ హైకమాండ్ ను ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం వేరే అభ్యర్థిని ప్రకటించడం మోసం కాదా అని నిలదీశారు.
గెలవక ముందు వాడు కోవడం విజయం సాధించాక విస్మరించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
వయో భారంతో అలసి పోయినా ఎక్కడా వెను దిరిగి చూడని అరుదైన గాయకుడు గద్దరన్న అని కొనియాడారు. ఆయన కుటుంబాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రస్తుత సర్కార్ పై ఉందన్నారు .