మోదీ ఎన్నిసార్లు వస్తే అంత లాభం
స్పష్టం చేసిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – తమ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీ ప్రభావం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. శనివారం ఆయన జాతీయ మీడియా ఇండియా టుడే తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమిళనాడుకు ఎన్నిసార్లు ప్రధానమంత్రి వస్తే తమకు అంత లాభం చేకూరుతుందని చెప్పారు. అది తమకు లాభం తప్ప నష్టం చేకూరదన్నారు.
వాళ్లు కలల్లో తేలి యాడుతున్నారని, తమిళులు తమపై ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించ బోరంటూ ప్రకటించారు. కానీ బీజేపీ, మోదీ తమ ఆధిపత్యపు భావజాలాన్ని తమిళనాడుపై రుద్దాలని చూస్తున్నారని కానీ అది వర్కవుట్ కాదన్నారు సీఎం ఎంకే స్టాలిన్.
తమను అవినీతిపరులుగా చూపించే ప్రయత్నం చేస్తోందని, కానీ ఎవరు అవినీతి పరులను రక్షిస్తున్నారో దేశమంతా ప్రజలకు తెలుసన్నారు సీఎం ఎంకే స్టాలిన్. రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలు ఉన్నాయని, ఇండియా కూటమికి అత్యధిక సీట్లు రానున్నాయని జోష్యం చెప్పారు . తాము ఏం చెప్పామో అదే చేస్తున్నామని తెలిపారు .