వివేకాను నేను చంపలేదు
ఎంపీ అవినాష్ రెడ్డి
కడప – వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డికి సూచించారు. ఆమె పదే పదే తాను దివంగత ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినట్లు చెప్పడంపై శనివారం స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
షర్మిల ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. ఎవరు హంతకులో ఎవరు కాదో ప్రజలకు స్పష్టం గా తెలుసన్నారు. అనవసరంగా ఎన్నికల వేళ తనపై , సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు వైఎస్ షర్మిలా రెడ్డికి.
వివేకా ఎలా చని పోయాడో సీబీఐ కూడా విచారణ చేపట్టిందన్నారు. కానీ ఆ విచారణలో తానే చంపినట్లు ఎక్కడా లేదన్నారు. షర్మిల తానే నేరుగా వెళ్లి హత్య చేసినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలి వేస్తున్నానని అన్నారు అవినాష్ రెడ్డి.
మనిషి పుట్టుక పుడితే విచక్షణ ఉండాలంటూ ఎద్దేవా చేశారు ఎంపీ. అయితే సీబీఐ ఇప్పటికే అవినాష్ రెడ్డే హంతకుడని తేల్చిందంటూ బాంబు పేల్చారు వైఎస్ షర్మిలా రెడ్డి.