ప్రజా సంక్షేమమే వైసీపీ ఎజెండా
స్పష్టం చేసిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఒక్క ఏపీ సర్కార్ కే చెల్లుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. శనివారం మేమంతా సిద్దం యాత్ర సందర్బంగా జనం నీరాజనం పలికారు. పలువురు సీఎంతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాము వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరిందని చెప్పారు. వివక్ష లేని సమాజం , అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగాన్ని తాము అమలు చేయడం జరిగిందని అన్నారు జగన్ రెడ్డి. ఇవాళ విద్య, వైద్యం, ఉపాధి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేశానని చెప్పారు.
తమ ప్రయారిటీ ఎప్పుడూ ప్రజా సంక్షేమనని మరోసారి స్పష్టం చేశారు. అందుకే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ న్యాయ బద్దంగా, పారదర్శకతంగా ఉండాలని వాలంటీర్లను నియమించడం జరిగిందని అన్నారు. కానీ విపక్షాలు కావాలని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, వారిని జనం నమ్మరని పేర్కొన్నారు జగన్ రెడ్డి.
పెన్షన్లు అందకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఎవరో ప్రజలకు, లబ్దిదారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలకు మేలు చేసేలా పని చేయాలని హితవు పలికారు సీఎం.