SPORTS

రాజ‌స్థాన్ జోర్దార్ బెంగ‌ళూరు బేజార్

Share it with your family & friends

6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

జైపూర్ – ఐపీఎల్ 2024లో భాగంగా రాజ‌స్థాన్ లోని జైపూర్ లో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద‌ర గొట్టింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. భారీ టార్గెట్ ముందుంచినా ఎక్క‌డా తొట్రుపాటుకు గురి కాకుండా దూసుకు వెళ్లింది. ఓ వైపు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన సెంచ‌రీ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది.

స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆది నుంచే ప‌రుగుల వ‌ర‌ద పారినా ఆశించిన మేర మ‌రిన్ని ర‌న్స్ చేయ‌లేక పోయింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ ముందుంచింది. ఇక కోహ్లీ 113 ప‌రుగుల‌తో దంచి కొట్టినా ఫ‌లితం లేకుండా పోయింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆది లోనే షాక్ త‌గిలింది. యంగ్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ అద్భుత‌మైన బంతికి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఒక ప‌రుగుకు ఒక వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో రంగంలోకి దిగాడు సంజూ శాంస‌న్. ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ తో క‌లిసి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఇద్ద‌రూ క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

గెలిచేందుకు 24 ప‌రుగులు ఉండ‌గానే అవుట్ అయ్యాడు సిరాజ్ బంతికి. ఆ త‌ర్వాత ప‌రాగ్ , జురైల్ ఊహించ‌ని బంతుల‌కు వెనుదిరిగారు. అయినా జోస్ బ‌ట్ట‌ర్ జూలు విదిల్చాడు. 4 ప‌రుగులు కావాల‌ల్సి ఉండ‌గా సిక్స‌ర్ తో విక్ట‌రీ షాట్ కొట్టాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ మ‌రోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 69 ప‌రుగులు చేశాడు. ఇంకా 5 బంతులు మిగిలి ఉండ‌గానే 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్.