కదం తొక్కిన విరాట్ కోహ్లీ
6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి
జైపూర్ – రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 కీలక లీగ్ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది రాజస్థాన్ రాయల్స్ . కెప్టెన్ శాంసన్ టాస్ గెలిచి ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు.
మైదానంలోకి దిగిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. కెప్టెన్ డుప్లిసిస్ తో కలిసి పరుగుల వరద పారించాడు. కేవలం 72 బంతులు మాత్రమే ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మరోసారి తనకు ఎదురే లేదని చాటాడు. ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు.
రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అవసరమైన సమయంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కేవలం 72 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రన్ మెషీన్ 12 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 113 రన్స్ చేశాడు. శాంసన్ ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేక పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 184 రన్స్ టార్గెట్ ముందుంచింది ఆర్సీబీ.
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. జైశ్వాల్ 1 పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. ఈ సమయంలో మైదానంలోకి దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ , బట్లర్ తో కలిసి పరుగుల వరద పారించాడు. బట్లర్ 100 పరుగులు చేస్తే శాంసన్ 69 రన్స్ తో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు.