కేసీఆర్ ను జైలుకు పంపిస్తా – సీఎం
సంచలన కామెంట్స్ చేసిన రేవంత్
తుక్కుగూడ – తమ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతూ, సభ్యతా సంస్కారం మరిచి పోయిన మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు ఆయన హాజరై ప్రసంగించారు.
కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని చర్లపల్లి జైలుకు పంపిస్తామని, ఎన్నికలు ఉన్నాయని ఆగామని అన్నారు రేవంత్ రెడ్డి. నిరాధారమైన ఆరోపణలు చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. ఏ ఒక్క రైతు పంట కారణంగా ఆత్మహత్య చేసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి.
తాను జానా రెడ్డిలా ఊరుకుండే వ్యక్తిని కానని, తాను అనుకుంటే చేసి తీరుతానని స్పష్టం చేశారు. కేసీఆర్ ను జైలుకు పంపించకుండా నిద్ర పోనని ప్రకటించారు సీఎం. కేసీఆర్ తో పాటు కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్ రావు, ఇంకో సంతోష్ రావులను కూడా జైలు పాలు చేస్తామన్నారు. అందరికీ జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నగ్నంగా ఊరిగించే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. కాలు బెణికిందని తాము ఊరుకున్నామని లేక పోతే ఆరోజే అరెస్ట్ చేయించే వాడినని కుండ బద్దలు కొట్టారు.