జగన్ రెడ్డి ఇక ఇంటికే
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సీఎంను రావణాసురుడితో పోల్చారు టీడీపీ చీఫ్. ఎన్నికలయ్యాక జగన్ రాక్షస పాలన ఉండదన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా గళం నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్బంగా చేపట్టిన యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏపీని సర్వ నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డిదేనంటూ ఎద్దేవా చేశారు. రావణాసురుడిని అంతం చేయడానికి రాముడు కదిలితే, ఆయనకు వానర సైన్యంతో పాటు ఉడుత కూడా తన వంతు సాయం అందించిందని అన్నారు.
అలాగే రామసేతువు నిర్మిస్తుంటే సముద్రుడు కూడా శాంతించి సహకరించాడని చెప్పారు చంద్రబాబు నాయుడు. సమాజానికి దుష్ట పీడ విరగడ అవుతుంది అంటే సృష్టి మొత్తం సహకరిస్తుందన్నారు. ఇప్పుడు ఏపీలో జగన్ పాలన అంతం కోసం జరుగుతున్నది అదేనని జోష్యం చెప్పారు టీడీపీ చీఫ్.