రాహుల్ అరుదైన నాయకుడు
మాజీ ఆర్బీఐ గవర్నర్ రాజన్
న్యూఢిల్లీ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక ఆర్థికవేత్తగా, మాజీ గవర్నర్ గా తను చూసిన నాయకులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వేత్తలలో ఒకడిగా గుర్తింపు పొందారు.
గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయనపై భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అయినా రాజన్ పట్టించు కోలేదు. ఈ దేశానికి కావాల్సింది మతం, కులం , ద్వేషం కాదని స్పష్టమైన ఆర్థిక వ్యవస్థ కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా ఆయన ప్రధాన మంత్రి పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ గురించి నాయకుడు కాదని ఆయన సాధారణ మానవుడని, అందరికీ ఆమోద యోగ్యమైన పొలిటికల్ లీడర్ అంటూ కితాబు ఇచ్చారు.