వాయిదా పద్దతుల్లో బిల్లుల చెల్లింపు
హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు
హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరిషనపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐపీఎల్ 2024 లీగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు లీగ్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తోంది హైదరాబాద్ .
ఇందులో భాగంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి హెచ్ సీ ఏకు. ఈ మేరకు లీగ్ మ్యాచ్ ల నిర్వహణకు గాను విద్యుత్ సరఫరా చేయలేమంటూ టీఎస్ఎస్ పీడీసీఎల్ స్పష్టం చేసింది ఈ మేరకు సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీతో తాము చర్చలు జరిపామని వెల్లడించారు ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరిషనపల్లి.
ఉప్పల్ స్టేడియంకు సంబంధించి ఇప్పటి వరకు పేరుకు పోయిన విద్యుత్ బిల్లులను తాము పూర్తిగా ఒకేసారి చెల్లించలేమని, వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని తాము సీఎండీకి ప్రతిపాదించామని తెలిపారు. దీనిపై సీఎండీ ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు జగన్ మోహన్ రావు అరిషనపల్లి.