మోదీ ఈ యుగపు యోగి
కొంపెల్లి మాధవీ లత
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత సంచలనంగా మారారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీనికి కారణం ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ముచ్చటించారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు.
అంతే కాదు ఈ దేశంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ గనుక లేక పోతే తీవ్రమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు భారత్ అంటే చులకన భావం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు కొంపెల్లి మాధవీ లత.
ఇదిలా ఉండగా ఆమె ఇంటర్వూను చూశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మాధవీ లత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు ఆమె ఇంటర్వూ చూడాలని కోరారు. ఈ సందర్బంగా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
మోదీ ఈ యుగానికి చెందిన యోగి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనను ప్రశంసించినందుకు ఆమె ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మోదీ నుంచి స్పూర్తి పొందానని చెప్పారు.