ఏపీలో భారీగా పెరిగిన ఓటర్లు
స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో జరగబోయే శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. ఇదిలా ఉండగా తాము గత మార్చి నెలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని పేర్కొంది.
ఆనాటి నుంచి నేటి దాకా కొత్తగా 1,26, 549 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారని వెల్లడించింది. దీంతో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కు పెరిగిందని పేర్కొంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక పురుషుల ఓటర్ల సంఖ్యా పరంగా చూస్తే 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు వెల్లడించింది.
అయితే ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకునేందుకు మరింత అవకాశం ఉందని, దీంతో భారీ ఎత్తున ఓటర్లు పెరిగే ఛాన్స్ లేక పోలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇటు అసెంబ్లీ అటు లోక్ సభ ఎన్నికలు జరుగుతుండడం విశేషం.