బాబాయి హత్యపై జగన్ మౌనమేల..?
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
కమలాపురం – తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తే ఇప్పటి వరకు సీఎంగా ఉన్న సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేక పోయారని నిలదీశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు.
అంతకు ముందు పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. భూము కోసం ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తమ్ముడిని చంపాలని చూసిన వాళ్ళ పై ఎటువంటి చర్యలు లేవన్నారు. నిందితులు ఎవరో కాదు స్థానిక ఎమ్మెల్యే , ఎంపీలకు అనుచరులుగా ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఓట్లు వేసింది హత్యలు చేసేందుకని అనుకున్నారా అంటూ సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ అనేది వైఎస్సార్ కల అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కుంభ కర్ణుడంటూ ఎద్దేవా చేశారు. నాలుగున్నర ఏళ్లు నిద్ర పోయాడని, ఇప్పుడు మేల్కొన్నాడని మండిపడ్డారు వైఎస్ షర్మిల.