NEWSNATIONAL

బీహార్ లో బీజేపీ కూట‌మిదే హ‌వా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ
బీహార్ – ఈ దేశం ఎంద‌రికో నీడ నిచ్చింది..ప్ర‌స్తుతం అభివృద్దికి దానిని అడుగ‌డుగునా అడ్డు త‌గులుతూ ఆటంకంగా మారిన ఇండియా కూట‌మికి మ‌ధ్య యుద్దం కొన‌సాగుతోంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆదివారం బీహార్ లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు.

ఇక్క‌డ బీజేపీ , ఎన్డీయే భాగ‌స్వామికి చెందిన అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇవాళ ప్ర‌పంచంలోనే భార‌త్ నెంబ‌ర్ స్థానం కోసం పోటీ ప‌డుతోంద‌న్నారు. పేదరికం అన్న‌ది లేకుండా చేయాల‌న్న‌దే త‌న సంక‌ల్ప‌మ‌ని ప్ర‌క‌టించారు.

బీజేపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఈ భారీ ర్యాలీని చూస్తుంటే ఇక విజ‌య యాత్ర మొద‌లైన‌ట్లేన‌ని తాను భావిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి మోదీ. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసినా తాను ప‌ట్టించు కోన‌ని చెప్పారు.

త‌న దృష్టి మొత్తం ఏకైక భార‌తం ప్ర‌పంచాన్ని ఏలాలని, ఆ దిశ‌గా తాను అడుగులు వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను 2024 ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు. తాను 2047 గురించి ప్లాన్ చేస్తున్నాన‌ని చెప్పారు.