NEWSNATIONAL

బెంగాల్ లో బీజేపీ హ‌వా

Share it with your family & friends

ఈసారి టీఎంసీకి షాక్

ప‌శ్చిమ బెంగాల్ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూట‌మికి క‌నీసం 400 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని చెప్పారు. అంతే కాదు దేశ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్ట బోతున్నామ‌ని అన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ లో ప‌ర్య‌టించారు. భారీ ఎత్తున రోడ్ షో చేప‌ట్టారు. అనంత‌రం జ‌రిగిన బహిరంగ స‌భ‌లో మోదీ పాల్గొని ప్ర‌సంగించారు. వై నాట్ 400 అనేది త‌మ ఎన్నిక‌ల నినాద‌మ‌ని చెప్పారు. విప‌క్షాల‌తో కూడిన భార‌త కూట‌మికి అంత సీన్ లేద‌న్నారు. వారిలో వారికే స‌ఖ్య‌త లేద‌ని ఇక దేశాన్ని ఎలా కాపాడుతారో చెప్పాల‌ని నిల‌దీశారు మోదీ.

రాహుల్ గాంధీ చిన్న పిల్లాడ‌ని, ఇంకా పిల్ల చేష్ట‌లు పోలేద‌న్నారు. వారికి అభివృద్ది అంటే ప‌ట్ట‌ద‌ని అన్నారు. కేవ‌లం అడ్డుకోవ‌డం త‌ప్ప వారు ఈ దేశానికి చేసింది ఏమీ లేద‌న్నారు. మ‌రోసారి తాను పీఎం అవుతాన‌ని, అభివృద్దే ఎజెండాగా ముందుకు వెళతానంటూ ప్ర‌క‌టించారు. ఇక ప‌శ్చిమ బెంగాల్ లో దీదీ ప‌నై పోయింద‌న్నారు. బీజేపీ జెండా రెప రెప లాడేందుకు సిద్దంగా ఉంద‌న్నారు పీఎం.